నమ్మకం
- తీర్ధ స్నానం పాపాన్ని కడిగి వేయలేదు .
- క్షేత్ర దర్శనం పుణ్యాన్ని ప్రసాదించలేదు.
- గురు సేవనం గమ్యాన్ని చూపలేదు.
- భజన ఒక్కటే భక్తికి పరాకాష్ట కాదు.
- పూజ చేసినంతనే పరమాత్మ కనపడడు.
- ప్రసాదం తిన్నంతనే పవిత్రుడు కాలేడు
- దానం చేసినంత మాత్రాన ధర్మాత్ముడు కాడు.
- ధ్యానం చేసినత మాత్రాన దైవం దరి చేరడు
- కారణం పరిపూర్ణ విశ్వాస లోపం.
- చేసే పని పై పూర్తి నమ్మకం ఉన్ననాడు
- భగవంతుడు పూర్ణ ఫలితం అందచేస్తాడు